పార్లమెంటు సమావేశాల గడువు పెంచే అవకాశం?
పార్లమెంటు సమావేశాలు గడువు పెంచాలనే యోచనలో యూపీఏ ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రణాళికతో తెలంగాణ బిల్లును నిన్న సభలో మూజువాణి ఓటుతో ఆమోదింపజేసిన క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు ఎంపీ జయప్రద యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. దాంతో, మహిళా రిజర్వేషన్ బిల్లుపై దృష్టి సారించి, పునరాలోచనలో పడ్డ కేంద్రం సమావేశాల రోజులను పెంచాలనుకుంటున్నట్లు సమాచారం. అటు ఈ నెల 23తో సమావేశాలు ముగియనున్న సంగతి తెలిసిందే.